ఇండియన్ వర్కర్ మృతి: షాక్‌లోనే కుటుంబం
- February 08, 2017
మస్కట్: ఇండియాకి చెందిన సింధు కుమారి అనే మహిళ సలాలా ప్రాంతంలో గత శుక్రవారం విగతజీవిగా కన్పించింది. ఆమె గత నాలుగేళ్ళుగా ఒమన్‌లోనే పనిచేస్తోంది. తమ సోదరి మరణం తమను తీవ్రంగా కలచివేసిందని మృతురాలి సోదరుడు శాంతకుమార్ సదాశివన్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విచారణ కొనసాగుతున్నందున సింధుకుమారి మృతదేహాన్ని స్వదేశానికి తరలించలేకపోతున్నట్లు ఎంబసీ అధికారులు చెప్పారు. ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ వలసదారుడు సింధుని అతి కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఆమె శరీరంపైనున్న బంగారు ఆభరణాల్ని నిందితుడు దొంగిలించాడు. రాయల్ ఒమన్ పోలీసులు, ఘటన గురించి కనుగొన్న 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అరబ్‌కి చెందిన వ్యక్తిగా నిందితుడ్ని గుర్తించారు. బాధితురాలి ఇంట్లోకి ఆయుధంతో ప్రవేశించిన నిందితుడు ఆమెను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. నిందితుడు తాను చేసిన నేరాన్ని ఒప్పుకోగా, దొంగిలించిన నగల్ని పోలీసులు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి నిందితుడ్ని అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- కువైట్‌లో వీధి కుక్కలు..ఇంటిరీయర్ మినిస్ట్రీ కీలక సూచనలు..!!
- ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!
- దుబాయ్‌లో ఉద్యోగం మారుతున్నారా.. నాన్ కంపీట్ క్లాజ్ తెలుసా?
- బౌషర్‌లో ఇంటి నుంచి ఏసీ యూనిట్ల చోరీ..!!
- సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!
- తెలంగాణ టూరిజానికి డిజిటల్ బూస్ట్..
- ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..
- వాహన బీమా పేరుతో ఆన్లైన్ మోసాలు.. దుబాయ్ పోలీసుల 10 కీలక సూచనలు
- దుబాయ్‌లో ‘మొబిలిటీ ల్యాబ్స్’.. స్వయంచాలక రవాణా టెక్నాలజీల పరీక్షలకు కొత్త వేదిక







