నటి బితస్తా సాహా కోల్‌కతాలోని తన ఫ్లాట్‌లో శవమై..
- February 08, 2017
కోల్‌కతా: బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన నటి బితస్తా సాహా కోల్‌కతాలోని తన ఫ్లాట్‌లో శవమై కనిపించారు. సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమె మృతదేహం పాక్షికంగా చెడిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు రోజులుగా బితస్తా తల్లి కుమార్తెకు ఫోన్ చేస్తుంటే సమాధానం లేకపోవడంతో ఆమె బుధవారం ఉదయం తన కుమార్తె ఒంటరిగా ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చారు. ఎంత సేపు తలుపు కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపు పగలకొట్టి చూడగా ఆమె సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు. ఆమె శరీరం కూడా పాక్షికంగా కుళ్ళిపోయింది. అంతేకాదు మృతదేహంపై పలు చోట్ల గాయాలున్నాయి, మణికట్టు దగ్గర చీలిక కూడా ఉందని పోలీసులు గుర్తించారు.
ప్రాథమిక దర్యాప్తులో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పంపామని, రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే ఈ సంఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. ఒత్తిడి కారణంగా నటి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చెప్పారు. ఆమె ఫోన్‌కాల్ వివరాలతో సహా అన్నింటినీ పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ టూరిజానికి డిజిటల్ బూస్ట్..
- ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..
- వాహన బీమా పేరుతో ఆన్లైన్ మోసాలు.. దుబాయ్ పోలీసుల 10 కీలక సూచనలు
- దుబాయ్‌లో ‘మొబిలిటీ ల్యాబ్స్’.. స్వయంచాలక రవాణా టెక్నాలజీల పరీక్షలకు కొత్త వేదిక
- కిక్కిరిసిన యాదగిరిగుట్ట క్యూలైన్లు
- అమెరికాలో H-1B వీసాల పై నిఘా పెంపు.. కంపెనీలకు కొత్త కష్టాలు?
- యూపీలో భారీ వర్షాలు ..17 మంది మృతి
- దుబాయ్ జబీల్ పార్క్‌లో ‘వికసిత్ భారత్ రన్ 2026’.. 1,500 మందికి పైగా పాల్గొనడం
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







