పాదచారుల బ్రిడ్జ్‌ కోసం ఇ-రింగ్‌ రోడ్‌ మూసివేత

- February 08, 2017 , by Maagulf
పాదచారుల బ్రిడ్జ్‌ కోసం ఇ-రింగ్‌ రోడ్‌ మూసివేత

పబ్లిక్‌ వర్క్స్‌ అథారిటీ అష్గల్‌, తాత్కాలికంగా ఇ- రింగ్‌రోడ్‌లోని కొంత ప్రాంతంలో రెండు వైపులా ట్రాఫిక్‌ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌పోర్ట్‌ స్ట్రీట్‌ మరియు అల్‌ తుమామా ఇంటర్‌సెక్షన్‌ వద్ద ఈ క్లోజర్‌ని అమలు చేస్తున్నారు. పెడెస్ట్రియన్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం కోసం ఈ తాత్కాలిక మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అష్గల్‌ అధికారులు చెప్పారు. ఇ-రింగ్‌ రోడ్‌పై మూసివేత అమల్లో ఉన్నందున, ఎయిర్‌పోర్ట్‌ స్ట్రీట్‌ నుంచి అల్‌ తుమామా ఇంటర్‌సెక్షన్‌కి వెళ్ళేవారు ఒక్బా బిన్‌ నఫిస్‌ స్ట్రీట్‌ని అలాగే ఆల్టర్నేటివ్‌ లోకల్‌ రోడ్స్‌ని వినియోగించుకోవచ్చు. అల్‌ తుమామా ఇంటర్‌సెక్షన్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ స్ట్రీట్‌ వైపు వెళ్ళేవారు నజ్మా స్ట్రీట్‌ని అల్‌ హదారా స్ట్రీట్‌ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్‌ మళ్ళింపులకు సంబంధించి మ్యాప్‌ని కూడా విడుదల చేశారు వాహనదారులకోసం. ఇ-రింగ్‌ రోడ్డుపైనుంచి పాదచారులు నడిచి వెళ్ళడం ద్వారా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నందున, వాటిని నివారించేందుకు ఈ బ్రిడ్జ్‌ని నిర్మిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com