తెలంగాణ సినీ అవార్డులు దసరాకి...
- February 09, 2017
తెలుగు రాష్ట్రాలు విడిపోయాక 'నంది' అవార్డులు ఏపీకి మాత్రమే పరితమైన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం 'నంది అవార్డులు' స్థానంలో మరో కొత్త పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ కమిటిని కూడా నియమించింది. ఇప్పటికే కమిటీ రెండు మూడు పేర్లని సూచించినట్టు తెలుస్తోంది. అందులో ఒకటి సింహా అవార్డులు.
అయితే, ఉగాది దగ్గరపడుతుండటంతో తెలంగాణ సినీ అవార్డులపై చర్చ మొదలైంది. ఇదే విషయాన్ని మీడియా మిత్రులు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అడిగారు. ఇందుకు సమాధానంగా.. తెలంగాణ సినీ అవార్డులు దసరాకి ఇస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ పండగలలో దసరా పెద్ద పండగ.
ఈ నేపథ్యంలో.. దసరాకి సినీ అవార్డులని ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
అయితే, ఆ అవార్డులు 'సింహా' పేరుతో ఇస్తారా.. ? లేదా.. ?? ఇతర పేర్లని పెడతారా అన్నది త్వరలోనే తెలియనుంది. ఇక, ఎప్పటిలాగే ఈ ఉగాధికి ఏపీ ప్రభుత్వం నంది అవార్డులని ఇవ్వనుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







