బెజవాడ కు దూసుకొస్తున్న మెట్రో కళ..!!

- September 17, 2015 , by Maagulf
బెజవాడ కు దూసుకొస్తున్న మెట్రో కళ..!!

విజయవాడలో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. 25 కి.మీ. మేర ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.మెట్రో నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. పట్టణాభివృద్ధిశాఖ నిబంధనల ప్రకారం రాష్ట్రం నివేదికను కేంద్రానికి సమర్పించాలన్నారు. విజయవాడలో నిర్మించనున్న మెట్రో నిర్మాణంపై ఇటీవలే మెట్రో నిపుణుడు శ్రీధరన్‌ నేతృత్వంలోని బృందం నివేదికను ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి అందజేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును దిల్లీ మెట్రో రైల్వేకార్పోరేషన్‌కు అప్పగించారు. రాష్ట్ర,నగరస్థాయిలో పట్టణ రవాణానిధి ఏర్పాటు చేయాలి* సూత్రప్రాయ అంగీకారం తెలిపినందున రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకోవాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com