అబుధాబి లో సవరించిన పార్కింగ్ ఉల్లంఘనల నిబంధనలు అమలులోకి
- February 11, 2017
అబుధాబి: ఉత్తమ సేవలను అందించేలా, టిక్కెట్లు ఖర్చులలో రాయితీలు మెరుగు పర్చే ప్రణాళికలో భాగంగా నూతన మార్పులు చేయబడిన సేవలను పార్కింగ్ డివిజన్ (మరకీఫ్)పార్కింగ్ ఉల్లంఘన నిబంధనలను మున్సిపల్ వ్యవహారాలు మరియు రవాణా శాఖ, ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ ప్రకటించింది.మరకీఫ్ డైరెక్టర్ మహమ్మద్ హమద్ అల్ ముహారి మాట్లాడుతూ, సవరించిన విధానం ప్రకారం నివాస ప్రాంతాలలో అక్రమ పార్కింగ్ చేయబడితే, గతంలో వసూలు చేసిన 500 ఏ ఈ డి కంటే తక్కువగా 200 ఏ ఈ డి టిక్కెట్ల జారీలో వసూలు చేస్తారని పేర్కొన్నారు, అలాగే టికెట్ జారీ కాబడిన 4 గంటల తర్వాత ఆయా కార్లను లాక్కుని వెళ్తారని ఆయన తెలిపారు, బస్సులు మరియు టాక్సీ పార్కింగ్ స్థానాలలో అక్రమ పార్కింగ్ చేసినట్లయితే ,500 ఏ ఈ డి ల నుంచి 1000 ఏ ఈ డి లుగా పెంచారు. ఒక టికెట్ ఉపయోగించి, రెండు పార్కింగ్ స్థలాలను కనుక ఆక్రమించే వారికి 300 ఏ ఈ డి నుంచి 200 ఏ ఈ డి కు తగ్గిందబడింది. పార్కింగ్ ప్రాంతానికి పేర్కొనబడని ప్రాంతంలో అనుమతి 100 ఏ ఈ డి ల నుంచి 200 ఏ ఈ డి వరకు పెంచబడింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







