పొట్లకాయతో మునగాకు...
- February 12, 2017
కావలసిన పదార్థాలు: పొట్లకాయ - ఏడు అంగుళాల పొడవు ముక్క, మునగాకు - 1 కప్పు, ఉల్లిపాయ - 1, వెల్లుల్లి - 5 రేకలు, శనగపప్పు - 1 టేబుల్ స్పూను, సోంపు - అర టీ స్పూను, ఎండుమిర్చి - 3, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - అర టీ స్పూను, తిరగమోత దినుసులు - సరిపడా.
తయారుచేసే విధానం: తొక్క, గింజలు తీసిన పొట్లకాయను చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. నూనెలో శనగపప్పు, సోంపు, ఎండుమిర్చి ఒకటి తర్వాత ఒకటి వేగించి చల్లారిన తర్వాత బరకగా పొడిచేసుకోవాలి. ఇప్పుడు నూనెలో తాలింపుతో పాటు వెల్లుల్లి, ఉల్లి తరుగు వేగించి, పొట్లకాయముక్కలు, పసుపు, ఉప్పు కలిపి మూత పెట్టి చిన్న మంటపై మగ్గించాలి. ముక్కలు ఉడికిన తర్వాత పొడితో పాటు మునగాకులు వేసి తడి పోయేవరకు కలిపి దించేయాలి. వేడి వేడి అన్నంతో ఈ కూర చాలా బాగుంటుంది.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









