లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే? పాలకూర తీసుకోండి.. ఎండు ద్రాక్షను నీటిలో మరిగించి?..
- February 13, 2017లివర్ వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. బీట్రూట్, క్యారెట్లలో లివర్‌ను శుద్ధి చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. రెండింటిలోనూ ప్లాంట్ ఆధారిత ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటీన్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి లివర్ పనితనాన్ని మెరుగు పరుస్తాయి. అలాగే లివర్‌లోని విష పదార్థాలను బయటికి పంపించడంలో పాలకూర బాగా పనిచేస్తుంది. దాంట్లోని ఔషధ గుణాలు లివర్‌ను శుభ్రం చేస్తాయి. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అలాగే లివర్‌ను శుభ్రం చేయాలంటే..? ఒక కప్పు నాణ్యమైన ఎండు ద్రాక్షకు, మూడు కప్పుల నీటిని కలిపి 20 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని 24 గంటల పాటు నిల్వ చేయాలి. ఈ డ్రింక్‌ను వారం రోజుల పాటు తాగడం వల్ల లివర్ పూర్తిగా క్లీన్ అవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే, ఈ డ్రింక్ తీసుకోవాలనుకునే వారు ముందుగా మద్యం అలవాటు ఉన్నట్లయితే, పూర్తిగా మద్యానికి దూరంగా ఉండాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్