విజయ్‌ హీరోగా, హరి దర్శకత్వంలో...

- February 14, 2017 , by Maagulf
విజయ్‌ హీరోగా, హరి దర్శకత్వంలో...

చెన్నై: హరి దర్శకత్వంలోని 'సీ 3' చిత్రం ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టారు. విక్రం హీరోగా 'సామి 2'ని తెరకెక్కించనున్నారు. దీని తర్వాత విజయ్‌తో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హరి కూడా ఈ అంశంపై సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ''విజయ్‌తో సినిమా తెరకెక్కించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఆయనలాంటి మాస్‌ హీరోతో తీస్తే ఆ చిత్ర ఫలితమే వేరుగా ఉంటుంది. అందుకుతగ్గ నిర్మాత కావాలి. అప్పుడే నా ఆశ నెరవేరుతుంద''ని ఆయన చెప్పారు. తమ హీరో మాస్‌ ఇమేజ్‌కు హరి వేగమైన టేకింగ్‌ కలిస్తే తప్పకుండా ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని విజయ్‌ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com