భారీగా తగ్గిన బంగారం ధర..

- February 14, 2017 , by Maagulf
భారీగా తగ్గిన బంగారం ధర..

న్యూఢిల్లీ: రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం ఒక్కసారిగా తగ్గింది. స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు రూ.300 తగ్గి రూ.29,650కి చేరుకుంది. ఆభరాల తయారీదారుల నుంచి తగిన డిమాండ్ లేకపోవడమే పసిడి ధర పడిపోవడానికి కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అంతర్జాతీయంగానూ బంగారానికి అనుకున్నంత డిమాండ్ లేకపోవడంతో గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఏకంగా రూ.300 తగ్గడానికి కారణమైందని చెబుతున్నారు. వెండి కూడా కిలోకు రూ.100 తగ్గి రూ.42,900కు చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com