శశికళ శపథం!...

- February 15, 2017 , by Maagulf
శశికళ శపథం!...

చెన్నై: న్యాయస్థానం వద్ద లొంగిపోవడానికి చెన్నై నుంచి బెంగళూరు బయల్దేరిన శశికళ మెరీనా బీచ్‌లో జయలలిత సమాధి వద్ద నివాళులర్పిస్తూ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. పుష్పాలతో నివాళులర్పించిన తర్వాత శశికళ జయ సమాధి మీద గట్టిగా మూడు సార్లు చేత్తో చరిచి మరీ ఏదో శపథం చేశారు. వూహించని ఈ పరిణామానికి అందరూ బిత్తరపోయారు. సమాధి మధ్య భాగంలో తగిలేలా వంగి మరీ అరచేత్తో గట్టిగా చరిచారు శశికళ. ఒకసారి కొట్టడం.. ముకుళిత హస్తాలతో ఏదో ఉచ్చరించడం, మళ్లీ కొట్టడం, మళ్లీ ఉచ్చరించడం.. అలా మూడుసార్లు చేశారు. అనంతరం తిరిగి కారెక్కి బెంగళూరువైపు రోడ్డు మార్గంలో బయల్దేరారు.
జయ సమాధి సాక్షిగా శశికళ ఏదో శపథం చేశారని ఆ దృశ్యం చూసినవారికి అర్థమవుతోంది.
దాంతో శశి ఏమని శపథం చేసివుంటారన్న విషయం నిమిషాల్లోనే చర్చనీయాంశమైపోయింది. అనారోగ్యం కారణం చూపుతూ లొంగిపోయేందుకు నాలుగు వారాలు గడువుకోరిన శశికళకు సుప్రీంకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. దాంతో ఆమె వెంటనే బెంగళూరు బయల్దేరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com