దుకాణాలు నుండి ఖరీదైన ఫోన్ల దొంగిలిస్తున్నాడని యువకునిపై ఆరోపణ..

- February 15, 2017 , by Maagulf
దుకాణాలు నుండి ఖరీదైన ఫోన్ల దొంగిలిస్తున్నాడని యువకునిపై ఆరోపణ..

 రాజధానిలో రద్దీగా ఉండే దుకాణాలు నుండి ఖరీదైన మొబైల్ ఫోన్ల దొంగిలిస్తున్నారని  ఏమిరేట్ యువతపై  ఒక కొనుగోలుదారుడు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణపై నిందితుడు ఖండిస్తూ తనకు ఈ దొంగతనంతో  ఏమీ సంబంధం లేదని కోర్టుకి విన్నవించుకున్నాడు. ఓ 20 ఏళ్ళ వ్యక్తి అబూధాబీ లో వివిధ దుకాణాలలో ఒక దుకాణాన్ని ఎంచుకొని లోపలకు వెళ్లి ఖరీదైన ఫోన్లని చాకచక్యంగా దొంగిలిస్తున్నట్లు  కొందరు దుకాణదారులు అబూధాబీ క్రిమినల్ కోర్ట్ వద్ద గగ్గోలు పెట్టారు. నిందితుడు ఒక దుకాణంలో మూడు ఖరీదైన  మొబైల్ ఫోన్లను అపహరించాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు.షాప్ యజమానులు ఈ సందర్భంగా మాట్లాడుతూ , నిందితుడు తమ దుకాణాలకు కొనుగోలు చేసే వ్యక్తి మాదిరిగా వస్తాడని...తాను కొన్ని మొబైల్ ఫోన్లను కొనాలని ఆశిస్తున్నట్లు  కొన్నిరకాల ఫోన్లను చూపించమని కోరతాడని  సేల్స్ మాన్ నిందితుని కోరిక మేరకు రకరకాల ఖరీదైన ఫోన్లు పరీశీలిస్తున్నట్లు నటిస్తూ తన హస్త లాఘవం ప్రదర్శిస్తాడు ఇతర వినియోగదారులతో సేల్స్ మాన్ మఖ్ట్లాడుతున్న సమయంలో ఆ యువకుడు ఒక చేతి సంచిలో ఆ కొన్ని  ఫోన్లని దాచేస్తాడని ప్రాసిక్యూటర్ చెప్పారు. షాప్ లో పనిచేసే  కార్మికులని అనుమానించి పోయిన ఫోన్ల గురించి అడిగేవారమని నిందితునికి చూపిన తర్వాత వాటిని స్వాధీనం చేసుకోలేదన్నట్లుగా జవాబిచ్చేవారని ఎక్కువసార్లు, దుకాణ యజమానులు ఖరీదైన ఫోన్లని నిందితులు షాప్ వదిలిన తర్వాత, అవి పోయినట్లు గమనించినట్లు తెలిపారు. షాప్ యజమానుల వద్ద  ఫోన్లు దొంగిలించిన తర్వాత, ఎమిరేట్ నగరం శివార్లలో ఉన్న దుకాణాలకు విక్రయించే సమయంలో కనుగొన్న సీరియల్ సంఖ్యలు ఉపయోగించి దోచుకున్న ఫోన్లని పోలీసులు కనుగొన్నారు నిందితుడు మరొక వ్యక్తికి చెందిన ఒక ఎమిరేట్స్ గుర్తింపు పత్రం ఉపయోగించి వేరే దుకాణాలకు చోరీ ఫోన్లు విక్రయించడనే ఆరోపణలు కోర్టుకి ప్రాసీక్యూషన్ కు వివరించారు.దీనిపై విచారణని మార్చి వరకు వాయిదా పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com