రోడ్డు ప్రమాదంలో స్కూలు విద్యార్థిని మృతి..

- February 15, 2017 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో స్కూలు విద్యార్థిని మృతి..

15 ఏళ్ళ స్కూలు విద్యార్థిని, తీవ్ర గాయాలతో సలమానియా మెడికల్‌ కాంప్లెక్స్‌ హాస్పిటల్‌లో చేరగా, దురదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. రోడ్డుపై అతివేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు, అదుపు తప్పి 15 ఏళ్ళ పాకిస్తానీ బాలిక అరూజ్‌ కైసర్‌ మీదకు దూసుకెళ్ళింది. అరూజ్‌ కైసర్‌ 8 వ తరగతి చదువుతోంది. స్కూల్‌ బస్‌ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆమె ఈ ప్రమాదానికి గురయ్యింది. ఓ-నెగెటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ కోసం వలసదారులైన వలంటీర్లు శ్రమించారు, ఆమెన కాపాడేందుకు. రేర్‌ బ్లడ్‌ గ్రూప్‌ కావడంతో అంతలా కష్టపడాల్సి వచ్చింది. 40 యూనిట్ల బ్లడ్‌ని ఆమెకు అందించినప్పటికీ దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com