వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాల్లో భారత్‌ది రెండో స్థానం...

- February 15, 2017 , by Maagulf
వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాల్లో భారత్‌ది రెండో స్థానం...

న్యూదిల్లీ: గత ఏడాది దీపావళి అనంతరం భారీస్థాయిలో వాయుకాలుష్యంతో దిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రపంచంలోనే వాయు కాలుష్యం వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాల్లో మన దేశం రెండో స్థానంలో ఉండడం గమనార్హం. చైనా మొదటి స్థానంలో ఉంది. మొత్తం ప్రపంచంలో వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాల్లో సగానికి పైగా ఈ రెండు దేశాల్లోనే సంభవిస్తున్నాయన్నది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం.
బోస్టన్‌లోని స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌ 2017 విడుదల చేసిన నివేదిక ప్రకారం 2.54 లక్షలమంది కాలుష్యం కోరల్లో చిక్కుకుని మృత్యువాతపడగా, అనేక మంది వూపిరితిత్తుల జబ్బులతో బాధపడుతున్నారు.
బంగ్లాదేశ్‌ కంటే 13 రెట్లు, పాకిస్థాన్‌ కంటే 21 రెట్లు అధికంగా భారత్‌లో బాధితులు ఉన్నట్లు నివేదిక తెలియజేస్తోంది.
ప్రపంచంలో 92శాతం.. 
ప్రపంచంలో 92 శాతం ప్రజలు అనారోగ్యానికి కారణమయ్యే కలుషిత గాలిని పీలుస్తూ జీవిస్తున్నారని సర్వే వెల్లడించింది. అంతర్జాతీయస్థాయిలో కాలుష్య సమస్య నానాటికీ తీవ్రతరం అవుతోందని, అకాల మరణాలకు ఇది ప్రధాన కారణంగా మారిందని గుర్తించినట్లు హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (హెచ్‌ఈఐ) అధ్యక్షుడు డాన్‌ గ్రీన్‌బౌమ్‌ పేర్కొన్నారు. పైన పేర్కొన్న అధ్యయనాన్ని నిర్వహించిన పరిశోధనా సంస్థ ఇదే. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం మంచి మార్పులు చోటుచేసుకోవడం కన్పించిందని అయితే ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు మాత్రం తీవ్ర స్థాయిలో ఉన్నాయని సంస్థ నివేదిక పేర్కొంటోంది. 2వేల మంది పరిశోధకులు ఈ అధ్యయనంలో కృషిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com