42 వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఇండియన్ స్కూల్ మస్కట్..
- February 15, 2017
ఇండియన్ స్కూల్ మస్కట్ (ఐఎస్ఎం) పాఠశాల గత వారం దాని 42 వ వార్షిక రోజుని గొప్ప అభిరుచి మేళవింపుతో ఉత్సాహంగా మరియు ఉల్లాస వాతావరణ నడుమ పాఠశాల యొక్క బహుళార్ధసాధక ప్రాంగణంలో ఘనంగా జరిగింది.అల్ ఓమానియా ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ అఫ్తాబ్ పటేల్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుల్తానేట్ లో ఒమన్ ఇండియన్ స్కూల్ బోర్డు అఫ్ డైరెక్టర్ల ఫైనాన్స్ డైరెక్టర్ మొహమ్మద్ సబీర్ ఫైజి ఇండియన్ స్కూల్ మస్కట్ మేనేజింగ్ కమిటీ అధ్యక్షుడు ఎన్ ఒమనకుట్టన్,స్కూల్ మేనేజింగ్ కమిటీ సభ్యులు; కార్యక్రమ నిర్వాహకుడు ప్రిన్సిపాల్, డీప్ విల్సన్; వైస్ ప్రిన్సిపాల్స్, అసిస్టెంట్ వైస్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు కృషి చేశారు.ముఖ్య అతిథి ఇతర ఉన్నతాధికారుల్లో మరియు అధికారిక ప్రిన్సిపాల్ తో కలిసి సాంప్రదాయరీతిలో జ్యోతిప్రజ్వలన చేసి ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభమించారు. పాఠశాల గాయక బృందం చేసిన ప్రార్థన పాటతో ఎన్నో భావాలను ప్రదర్శించేలా పదాల కూర్పుతో వీక్షకులని అలరించింది. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ అధికారికంగా అతిధులకు ఘనంగా స్వాగతించారు మరియు పాఠశాల యొక్క వార్షిక నివేదికను ఈ సందర్భంగా సమర్పించారు. తన నివేదికలో పాఠశాలలో అత్యుత్తమ విద్యావేత్తలు మరియు సహ పాఠ్య కార్యకలాపాలు రెండింటిలోనూ పాఠశాల అద్భుత విజయాలు ప్రముఖంగా ప్రస్తావించారు.ప్రేక్షకుల ఎదట ఒమనకుట్టన్ ప్రసంగిస్తూ, యువత మెదళ్లను పదును పెట్టి గత 42 సంవత్సరాలుగా పాఠశాల విజయాల దిశగా పయనిస్తుందని ఆయన తేలిపారు. అనంతరం ప్రసంగించిన అల్ ఓమానియా ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ అఫ్తాబ్ పటేల్ మాట్లాడుతూ ఈ వార్షికోత్సవంకు తాను ముఖ్య అతిథిగా పాల్గోవడం తన ఉనికిని చాటుకోవడం ఎంతో సంతోషం కల్గిస్తుందని తన హర్షాన్ని వ్యక్తం చేశారు.విద్యార్థులు నేర్చుకోవడంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయుల ఉన్నతమైన సేవలు కీలకమైన పాత్ర మరువలేనిదని ఆయన ఉద్ఘాటించారు. విద్యార్థులు గట్టి పట్టుదల మరియు ఆత్మ విశ్వాసాన్ని ఎన్నడూ వీడరాదని వారి కలలు సాకారమవ్వాలంటే కష్టించి చదవడమేనని విజయానికి ఎటువంటి అడ్డదారులు లేవనే సంగతి మరువకూడదని వారికి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చివరిగా సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒమనకుట్టన్ మరియు విల్సన్ కలిసి అవార్డులు అందించారు.
తాజా వార్తలు
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!







