అల్ ఖాఫ్జి లోని స్వదేశీయులను సందర్శించిన భారత రాయబారి
- February 16, 2017
రియాద్ : కీలకమైన అనేక విషయాలను చర్చించే నిమిత్తం భారత రాయబారి అహ్మద్ జావెద్ మంగళవారం అల్ ఖాఫ్ కమ్యూనిటీ సభ్యులను కలిశారు. అంతేకాకుండా ఆయన అంతర్జాతీయ భారతీయ పాఠశాలని పర్యటించి భారతీయ ప్రభుత్వం యొక్క కొత్త కార్యక్రమాలు మరియు అభివృద్ధి చర్యల పట్ల సిబ్బంది వివరించడంతో పాటు అక్కడ ఉన్న విద్యార్థులతో ఒక చర్చా గోష్ఠి నిర్వహించారు. మొదటి కార్యదర్శి (కమ్యూనిటీ సంక్షేమం) అనిల్ నౌటియాల్ రాయబారితో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా దౌత్యకార్యాలయం వద్ద మంగళవారం భారతీయ దౌత్యవేత్త జావేద్ ఆ ప్రాంతంలో జరిపిన మొట్టమొదట పర్యటన గురించి బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు. భారతీయ సమాజం సభ్యులతో జరిగిన ఒక సమావేశంలో, భారతీయ దౌత్యవేత్త జావేద్ కింగ్డమ్ తో భారతదేశం యొక్క సుహృద్భావ మరియు స్నేహపూర్వక సంబంధాలను గుర్తుచేసుకున్నారని ఆయన తెలిపారు.సౌదీ అరేబియాలో భారత ఉద్యోగులైన మీరు శ్రద్ధ, కృషి మరియు విధేయతతో మెలగాలని భారతేదేశ పౌరులంటే మిగతావారికి గౌరవ మర్యాదాలు పొందేలా ప్రవర్తించాలని ఆయన అన్నారు. అలాగే ఎల్లప్పుడూ స్థానిక చట్టాలను గౌరవించాలని కమ్యూనిటీ సభ్యులను ఆయన ఈ సందర్భంగా భారత రాయబారి అహ్మద్ జావెద్ కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







