సూపర్‌ మార్కెట్స్‌, ఈటరీలపై మున్సిపల్‌ అధికారుల తనిఖీలు..

- February 17, 2017 , by Maagulf
సూపర్‌ మార్కెట్స్‌, ఈటరీలపై మున్సిపల్‌ అధికారుల తనిఖీలు..

హెల్త్‌ మానిటరింగ్‌ సెక్షన్‌ - అల్‌ ఖోర్‌, అల్‌ దఖిరా మునిసిపాలిటీ, సూపర్‌ మార్కెట్లు, బచరీస్‌ మరియు రెస్టారెంట్లపై దాడులు చేసి, తనిఖీలు నిర్వహించింది. అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణం ఉందో లేదో ఈ తనిఖీల్లో అధికారులు పరిశీలించారు. తాజా మాంసం, అలాగే ఇంపోర్ట్‌ చేసిన మాంసాన్ని సైతం ఈ తనిఖీల్లో అధికారులు పరిశీలించి, హ్యూమన్‌ కంజంప్షన్‌కి అనుకూలంగా ఉందా? లేదా? అనే విషయాన్ని తేల్చారు. అలాగే ధరల వివరాల్ని సైతం తెలుసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ అండ్‌ కామర్స్‌కి చెందిన కన్స్యుమర్స్‌ ప్రొటెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌తో కలిసి మునిసిపాలిటీ అధికారులు ఈ తనిఖీలను నిర్వహించారు. ఇదిలా ఉండగా దోహా మునిసిపాలిటీ, ఎస్పైర్‌ అకాడమీలో ఫుడ్‌ సేఫ్టీపై పిల్లల్లో అవగాహన పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్‌ మునిసిపాలిటీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ - బీచెస్‌ అండ్‌ ఐలాండ్స్‌ సెక్షన్‌, సీలైన్‌ బీచ్‌ని అవాజ్‌ కంపెనీతో కలిసి శుభ్రం చేసింది. ఈ సందర్బంగా పెద్దమొత్తంలో వేస్టేజ్‌ని క్లీన్‌ చేయడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com