ఉగ్రవాదాన్ని అంతం చేయండి: ఆర్మీకి ఆదేశాలు ఇచ్చిన నవాజ్
- February 17, 2017
తన వరకు వస్తే గాని ఆ బాధేంటో తెలియదనే సామెతుంది. పాకిస్థాన్‌కు ఇది సరిగ్గా వర్తిస్తుంది. ఉగ్ర దాడులపై భారత్ ఎంత గగ్గోలు పెట్టినా పాక్ పట్టించుకోలేదు. అయితే గత కొంతకాలంగా పాకిస్థాన్ ఆ ముష్కర దాడులకు బలవుతోంది. తాజాగా గురువారం సింధ్ రాష్ట్రంలోని సుఫీ మసీదుపై ఉగ్ర దాడి జరిగింది. 88 మంది ముస్లింలు మృతి చెందగా సుమారు 350 మంది గాయపడ్డారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
ఈ ఘటనతో పాకిస్థాన్ ప్రభుత్వం మేల్కొంది. ప్రధాని నవాజ్ షరీఫ్ శుక్రవారం ఆ దేశ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వాతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. గాయపడిన బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం భద్రతా దళాధిపతులతో నవాజ్ సమావేశమయ్యారు. పూర్తి బలాన్ని వినియోగించి ఉగ్రవాదులను ఏరివేయాలని పాక్ ఆర్మీని ఆదేశించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







