ఇండియాలో ఉన్న ఒకే ఒక్క అగ్నిపర్వతం బద్దలైంది

- February 18, 2017 , by Maagulf
ఇండియాలో ఉన్న ఒకే ఒక్క అగ్నిపర్వతం బద్దలైంది

పనాజీ: భారత్‌లో ఉన్న ఏకైక అగ్నిపర్వతం బద్దలైంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న బారెన్ ఐలాండ్ వాల్కెనో విస్పోటనం చెందటంతో అందులోంచి లావా ఎగజిమ్ముతోంది.
1991లో చివరిసారిగా ఈ అగ్నిపర్వతం బద్దలవగా.. ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ విస్పోటనం చెందినట్లుగా గోవాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(ఎన్ఐఓ) తెలిపింది.
ప్రస్తుతం ఈ అగ్నిపర్వతం నుంచి భారీ ఎత్తున లావా ఎగజిమ్మడంతో పాటు దట్టమైన పొగలు వెలువడుతున్నట్లుగా ఎన్ఐఓ పేర్కొంది. గత నెల 23న బారెన్ అగ్నిపర్వతాన్ని పరిశీలించడానికి కొంతమంది శాస్త్రవేత్తల బృందం వెళ్లగా.. ఆ సమయంలో దాని నుంచి పొగలు వెలువడటం వారు గమనించారు.
పగటిపూట కేవలం పొగలు మాత్రమే వెలువడుతున్నట్లుగా గుర్తించిన శాస్త్రవేత్తలు, రాత్రి సమయంలో దాని నుంచి లావా బయటకొస్తున్నట్లుగా చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com