సినీనటి భావన అపహరణకు గురయ్యారు
- February 17, 2017
ముంబై: సినీనటి భావన అపహరణకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని ఎర్నాకుళంలో సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు దుండగలు అతాని ప్రాంతం వద్ద ఆమె కారును అడ్డుకుని అందులోకి చొరబడి దారి మళ్లీంచారు. దాదాపు 25 కిలోమీటర్లు కదులుతున్న కారులో ఆమెను లైగింక వేధింపులకు గురిచేశారు. తరువాత పలరివత్తమ్ ప్రాంతంలో కారును ఆపి దుండగులు మరో కారులో పరారయ్యారు.
ఘటన తరువాత భావన పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేసింది. దుండగులలో ఒకరు తన వద్ద పనిచేసిన డ్రైవరు మార్టిన్ అని పేర్కొంది. మరొకరు కూడా ఆమె వద్ద పనిచేసిన సునీల్‌గా పోలీసులు గుర్తించారు.
మార్టిన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కారులో తన చిత్రాలు, వీడియోలు చిత్రీకరించారని భావన పోలీసులకు తెలపడంతో పోలీసులు అపహరణ, వేధింపులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సినీనటి భావన మళయాలంతో పాటు ఒంటరి, మహాత్మ వంటి తెలుగు చిత్రాల్లో కూడా నటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







