నమో వేంకటేశాయకోసం నన్ను అడగలేదు : హీరో సుమన్
- February 18, 2017
హీరో సుమన్ ఆరడగుల ఎత్తు, హీరో అనే పదానికి అసలైన రూపం. కరాటే లో బ్లాక్ బెల్ట్ ... ఇది క్లుప్తంగా హీరో సుమన్ గురించిన ఇంట్రడక్షన్. కెరీర్ స్టార్టింగ్ లో చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ, సుమన్ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎదురుచూసే సమయం.. 80వ దశకంలో అప్పుడే స్టార్ హీరో ఇమేజ్ ని దక్కించుకోబోతున్నాడు హీరో సుమన్.
అందగాడు డ్యాన్స్ కూడా బాగానే వేయగల సమర్ధుడు కాబట్టి సుమన్ కు మంచి అవకాశాలు కూడా వచ్చాయి. కాని ఎందుకో అనుకున్నత క్రేజ్ రావడం సరికదా కొన్ని అనివార్య కారణాల వల్ల జైలుకి కూడా వెళ్లాడు సుమన్. ఈ మధ్య తిరుపతి లో కనిపించిన సుమన్ ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... ఇలా చెప్పుకొచ్చాడు...
చాలా ఏళ్ళు తెరకు దూరంగా ఉన్న తర్వాత మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచిపేరే సంపాదించుకున్నాడు. అన్నమయ్యలో, వేంకటేశ్వర స్వామిగానూ, రామదాసులో శ్రీరాముడి గానూ ఆయన చేసిన పాత్రలు మంచిగుర్తింపునే తెచ్చాయి.
అయితే అన్నమయ్య సినిమాకి గానూ ఆయన చేసిన క్యారెక్టర్ కి ఏ అవార్దు రాకపోవటం, ఆసినిమా యూనిట్ కూడా ఎక్కడా సుమన్ గురించి చెప్పకపోవటం పట్ల కొంత విచారం వ్యక్తం చేసిన సుమన్ ఈ సారి అదే క్రూ తో వచ్చీన ఓం నమో వేంకటేశాయ సినిమాలో తనకి ఏ క్యారెక్టర్ ఇవ్వకపోవటం పట్ల మాత్రం ఇప్పటివరకూ స్పందించలేదు.
ఓం నమో వేంకటేశాయ చిత్రానికి అయితే నన్నెవరూ అడగలేదు.మీరు శ్రీవేంకటేశ్వర స్వామిగా నటించి ఉంటే ఇంకా బాగుండేదని చాలా మంది అంటున్నారు కానీ అలా ఆశించడం కరెక్ట్ కాదనుకుంటున్నా.స్వామి దర్శనం కోసం ఎంతోమంది ఎదురు చూస్తారు కానీ ఆయన అనుగ్రహం ఉంటేనే దర్శనమవుతుంది. నేనింకా ఓం నమో వేంకటేశాయ చిత్రాన్ని చూడలేదు. చూసిన తరువాత కామెంట్ చేస్తా.
అన్నమయ్యలో వెంకన్న పాత్రకు రాఘవేంద్రరావు టీం వచ్చి అడగ్గానే షాకయ్యా.చేయగలనా అనిపించింది. నా ఫేస్, బాడీ వేంకటేశ్వర స్వామికి సరిపోతుందని చెప్పారు.నుదురు, ముక్కు, గెడ్డం కొలతలు కరెక్ట్‌గా ఉన్నాయన్నారు. ఆలోచించుకోమని ఓ రోజు టైం కూడా ఇచ్చారు.
అన్నమయ్య చేశాక చెప్పలేనంత పేరు వచ్చింది. నన్ను చూసినవాళ్లంతా నమస్తే పెడుతున్నారు. అప్పట్లో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మతో కలిసి సినిమా చూశా. అదే పెద్ద వరం.ఆ తర్వాత ఎన్నో దేవుడి పాత్రల్లో నటించా. అవన్నీ దైవ సంకల్పమే.
నాయకులతో మాట్లాడినంత మాత్రాన వారి పార్టీలో ఉన్నట్టు కాదు. చాలా మందిని కలుస్తుంటాం.ఎన్నో విషయాలపై మాట్లాడుతుంటాం.షర్టు కలర్ ను బట్టి ఏ పార్టీయో చెప్పే సంస్కృతి మారాలి.రాజకీయాల్లోకి రావాలా, వద్దా అని ఆలోచిస్తున్నా.2019లో నా అభిప్రాయాలు, ఆజెండాలకు సరిపోయే పార్టీకి సపోర్టు ఇస్తా.
నాకు పదవి అవసరం లేదు.నాకంటూ ప్రత్యేకమైన అజెండాలున్నాయి. ప్రధానంగా సైనికులు, రైతులు, వైద్యానికి సంబంధించిన విషయాల్లో మార్పులు రావాలి. మహిళలకు ప్రాధాన్య మివ్వా లి. మూడేళ్ల పాపపై అత్యాచారం చేసే వాళ్లను వెంటనే ఉరి తీయా లి. కమ్యూనిటీ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తా. వాళ్లను కూడా పైకి తీసుకురావాలని ఉంది.
సహ నటుడు భానుచందర్ వల్లే తెలుగు సినిమాల్లోకి వచ్చా.మొదట ఇద్దరు కిలాడీలు చిత్రంలో నటించాం కానీ కొన్ని ఇబ్బందుల వల్ల అది ఆగిపోయింది. వెంటనే తక్కువ సమయంలో తీసిన తరంగిణి చిత్రానికి మంచి ఆదరణ లభించింది.దర్శకుడు కోడి రామకృష్ణ నాలోని ప్రతిభను బయటకు తీశారు.ప్రసాదనే నిర్మాత వరుసగా నాతో ఐదు సినిమాలు తీశారు.అలాంటి వారందరికీ నేను రుణపడి ఉంటా.
తెలుగు చిత్ర సీమలో అప్పట్లో డ్యాన్స్ లకు చిరంజీవి ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో, ఫైట్లకు హీరో సుమన్ అంతే రీతిలో కీర్తిప్రతిష్టలు సొంతం చేసుకున్నారు. అలా తెలుగు చిత్ర సీమలో 'సూపర్ హీరో'గా సాగిపోతున్న వేళ... బ్లూ ఫిల్మ్ సినిమాల కేసులో ఇరుక్కుని, ఏడాదికి పైగా జైల్లో గడిపి, ఆపై సినిమా అవకాశాలు సన్నిగిల్లి, ద్వితీయ స్థాయి హీరోగా పరిశ్రమలో మిగిలిపోయిన సుమన్ ఆ సంఘటనలకు కుంగి పోకుండా తన ప్రత్యేకతని నిలబెట్టుకునే పాత్రలను చేస్తూ సాగిపోతున్నాడు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







