'బెజవాడ చాలా హుషారుగా ఉంది': నిఖిల్
- February 18, 2017
'బెజవాడ చాలా హుషారుగా ఉంది.. ఇక్కడి విద్యార్ధులు ఇంకా హుషారుగా ఉన్నారు' అని టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ అన్నాడు. కేబీఎన్ కళాశాల కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్ 'టెక్నోబెంక్వెట్' పేరుతో నిర్వహించిన కంప్యూటర్స్ మీట్ శనివారం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సభకు ప్రత్యేక ఆహ్వానితుడిగా నటుడు నిఖిల్ హాజరయ్యాడు. అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఎదుర్కోవాలని విద్యార్థులకు హీరో నిఖిల్ సూచించాడు.
విద్యార్ధి జీవితం చాలా కీలకమైందని, తాను ఎడ్యుకేషన్ పూర్తి చేసి గూగుల్లో జాబ్ సంపాదించానన్నాడు. సినిమా రంగంలోకి అడుగు పెట్టడంతో జాబ్ వదులుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.
మంచి ఉన్నతిని సాధించేందుకు విద్యార్ధులు కష్టపడాలని చెప్పాడు. విద్యార్ధులను కలుసుకోవటం, వారితో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందన్నాడు నిఖిల్.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







