వెండి తెరపై రాజీవ్, సోనియాల ప్రేమ కధ
- February 19, 2017
ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియాగాంధీల ప్రేమకథతో ఓ అరుదైన చిత్రం రాబోతుంది. అయితే ఇది పూర్తి స్థాయి చిత్రంగా కాక.. గంటన్నర నిడివితో షార్ట్ ఫిల్మ్‌గా రాబోతోంది. రాజీవ్ రాజకీయ జీవితాన్ని ఇందులో టచ్ చేయకుండా.. కేవలం అతని లవ్ స్టోరిని మాత్రమే కాన్సెప్ట్‌గా ఎంచుకున్నారు. రాజీవ్, సోనియాల మధ్య పరిచయం ఎలా జరిగింది.. ఇద్దరి మధ్య బంధం ఎలా ఏర్పడింది.. పెళ్లి వరకు అది ఎలా వెళ్లింది.. పేరెంట్సును ఎలా ఒప్పించారు వంటి ప్రతి యాంగిల్‌ను టచ్ చేస్తూ సినిమా రూపొందిస్తున్నారట. ఈ మూవీలో రాజీవ్ గాంధీగా టెలివిజన్ స్టార్ కరణ్ వీర్ బోరా నటిస్తుండగా..సోనియాగా ప్రియా బెనర్జీ అలరించనుంది. మార్చిలో సెట్ మీదకు వెళ్తున్న ఈ మూవీకి 'ఇజాజత్' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అయితే ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు సోనియా పుట్టిల్లు ఇటలీలోనూ విడుదల చేయడానికి వీలుగా ఇటాలియన్ భాషలోనూ తెరకెక్కించనున్నారు.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







