సంగీత దర్శకురాలిగా మారనున్న ఆమిర్ ఖాన్ కుమార్తె
- February 19, 2017
బాలీవుడ్లో నటుల పిల్లలు సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. షారుక్‌ఖాన్, సైఫ్ అలీఖాన్, శ్రీదేవి కుమార్తెల తెరంగేట్రంపై ఇప్పటికే బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ కుమార్తె ఇరా కూడా సినిమాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు బీటౌన్‌లో చెప్పుకుంటున్నారు. అయితే ఇరా మిగిలిన వాళ్లలా నటిగా కాకుండా సంగీత దర్శకురాలిగా మారాలని అనుకుంటుందట. ఆమీర్‌ఖాన్ కుమార్తె ఇరాకు చిన్నప్పట్నుంచి సంగీతమంటే చాలా ఇష్టం. ఆ ఆసక్తితోనే సంగీతం కూడా నేర్చుకుందట. అయితే సంగీతాన్నే తన కెరీర్‌గా మలుచుకోవాలని భావించలేదట. కానీ.. ఇప్పుడు అదే సంగీతం విభాగంలో పని చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమీర్ నిర్మించిన ‘ఢిల్లీ బెల్లీ’.. ‘తలాష్’ చిత్రాలకు సంగీతం అందించిన రామ్ సంపత్ వద్ద ఇరా శిష్యరికం చేయనుందట.
తాజా వార్తలు
- ఉద్యోగ మోసం ఆరోపణలు: కేరళలో సంస్థ యజమాని అదుపులోకి తీసుకున్నా.. సాధారణంగానే కార్యకలాపాలు
- న్యూయార్క్‌లో భారత్–జీసీసీ ట్రోయికా మంత్రుల సమావేశం
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!







