బంగారం కొంటే పన్ను
- February 19, 2017
నగదుతో రూ.2 లక్షలకుపైగా కొంటే 1% టీసీఎస్
సాధారణ వస్తువుల జాబితాలోకి బంగారం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: నగదు లావాదేవీలను నిరుత్సాహపరచడానికి కేంద్రం మరో అడుగు వేసింది. రెండు లక్షల రూపాయలకు మించి బంగారాన్ని నగదు రూపంలో కొంటే అక్కడికక్కడే 1 శాతం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్)ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. వాస్తవానికి, ఇప్పటి వరకూ నగదుతో బంగారం కొనడానికి రూ.5 లక్షల వరకూ పరిమితి ఉంది. ఆపైన కొన్న బంగారానికే టీసీఎస్ చెల్లించాల్సి ఉంది. కానీ, ఇటీవలి బడ్జెట్లో కేంద్రం బంగారాన్ని కూడా 'సాధారణ వస్తువుల' జాబితాలోకి చేర్చింది.
దాంతో, రూ.2 లక్షలపైన నగదు రూపంలో కొనుగోలు చేస్తే 1 శాతం టీసీఎస్ చెల్లించక తప్పదు. ఆర్థిక బిల్లు ఆమోదం పొందిన తర్వాత, ఏప్రిల్ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. నల్ల ధనాన్ని నిరోధించడంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నామని చెప్పారు. డిఫెన్స్ ఇంటెలిజెన్స్‌కు మరిన్ని కోరలు: అంతర్జాతీయ ఆర్థిక, బ్యాంకింగ్ లావాదేవీల వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ) నుంచి పొందే అధికారాలను రక్షణ శాఖలో కీలకమైన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ)కు ఇచ్చారు.
దాంతో, జమ్ము కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలకు తరలి వచ్చే ఉగ్రవాద నిధులు, హవాలా లావాదేవీలపై చర్యలు తీసుకోవడానికి దీనికి అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







