బాలీవుడ్ కి అడుగులు వేయనున్న సిసింద్రి

- September 19, 2015 , by Maagulf
బాలీవుడ్ కి అడుగులు వేయనున్న సిసింద్రి

తొలి సినిమా రిలీజ్ కూడా కాకముందే అక్కినేని అఖిల్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. అక్కినేని నటవారసుడిగా వెండితెరకు పరిచయం అవుతున్న అఖిల్, తొలి ప్రయత్నంలోనే సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే ఓ డెబ్యూ హీరో గతంలో ఎన్నడూ చేయని విధంగా భారీ బిజినెస్ చేసి రికార్డ్ సృష్టించిన సిసింద్రి, ఆ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీకి కూడా రెడీ అయిపోతున్నాడు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అఖిల్ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఇప్పటి వరకు చర్చల దశలోనే ఉన్న ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ రానుంది. అనుకున్న విధంగా అఖిల్ సినిమా ఘనవిజయం సాధిస్తే 'అఖిల్' హీరోగా ఆ సినిమాను బాలీవుడ్ రీమేక్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే టైటాన్ వాచెస్, మౌంటెన్ డ్యూ లాంటి యాడ్స్ తో నార్త్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడయ్యాడు అఖిల్. దీంతో బాలీవుడ్ ఎంట్రీకి ఇదే సరైన సమయం అని భావిస్తుంది అక్కినేని కుటుంబం. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్న అఖిల్ సినిమాను వివి వినాయక్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. తమన్, అనూప్ రుబెన్స్ లు సంగీతం అందిస్తుండగా మణిశర్మ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com