స్వైన్ ఫ్లూ లక్షణాలు...

- September 19, 2015 , by Maagulf


వ్యాధి లక్షణాలు 
జ్వరము మరియు దగ్గు, గొంతు తడారి పోవడం, కారుచున్న లేదా దిబ్బడ పడిన ముక్కు, ఊపిరి పీల్చడంలో ఇబ్బందిబీ ఇతర వ్యాధిలక్షణాలు ఒంటి నొప్పులు, తలనొప్పి, అలసట, వణకుట, డయేరియా, వాంతులు, కఫంలో రక్తము. 
స్వైన్ ఫ్లూ గురించి తెలుసుకోవలిసిన విషయాలు
- సీజనల్ ఫ్లూ (గతంలో స్వైన్ ఫ్లూగా పిలువబడినది). గాలిలో ఉన్న బాధిత పార్టికల్స్ ద్వారా ఒకరి నుండి మరొక వ్యక్తికి అంటుతుందే కాని పందుల ద్వారా వ్యాపించదు.

- కొన్ని క్రానిక్ మెడికల్ కండిషన్లు ఉన్న వ్యక్తులు, 65 సంవత్సరాలు లేక అంతకు పై వృద్ధులు, 5 సంవత్సరాలకు లోపుగల పిల్లలు మరియు గర్భిణులు తక్షణ అనారోగ్యం బారిన పడుటకు ఎక్కువ అవకాశం ఉంది.

- ప్రభుత్వముచే గుర్తించబడిన ఆసుపత్రుల్లో అవసరమైన మందులు లభిస్తున్నవి.

- డాక్టరు సిఫార్సు చేసినచో ఇంటి వద్ద ఉండండి. ఒక వేళ వ్యాధి లక్షణాలు పెచ్చు పెరిగితే (అధిక జ్వరము, ఊపిరి పీల్చుటలో ఇబ్బంది, చర్మము లేక పెదవులు నీలి రంగు పొందుట, కఫంలో రక్తం లేదా ప్రవర్తనలో తేడా) దగ్గరలో ఉన్న గుర్తించబడిన ఆరోగ్య కేంద్రమును సంప్రదించండి. పిల్లలకు జ్వరము, ప్రకోపము, ద్రవాలు తీసుకొనక మరియు ఆహారం స్వీకరించుటకు నిరాకరించినచో చిన్న పిల్లలను హాస్పిటల్కు తీసుకు వెళ్ళండి.

చేయవలసినవి 
- మీరు దగ్గినపుడు లేక చీదునపుడు మీ నోటిని మరియు ముక్కును చేతి రుమాలు లేకా టిష్యూ పేపరుతో కవర్ చేసుకోండి.
- నిత్యం సబ్బు మరియు నీటితో మీ చేతులు కడుగుకోండి.
- గుంపులకు దూరంగా ఉండండిబీ ఫ్లూతో బాధపడుతున్న వారికి కనీసం చేయి చాపు దూరంలో ఉండండి.
- మీకు జ్వరము, దగ్గు మరియు చీదు పరిస్థితి ఉన్నచో బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండండి.
- బాగా ఎక్కువగా నీరు త్రాగండి మరియు పోషకాహారము తినండి.
- బాగా నిద్రపోండి. నిద్ర తగ్గితే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి రోగం తీవ్రత పెరిగే ఛాన్స్ ఉంది.

చేయకూడనివి 
- కరచాలనం లేదా ఇతర పరస్పర కాంటాక్ట్ గ్రీటింగ్స్
- బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయడం
- ఫిజీషియన్ని సంప్రదించకుండా మందులు తీసుకోవడం


--డా.పేర్ల లక్ష్మి కుమారి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com