వలసదారులకు ఎలక్ట్రిసిటీ టారిఫ్ 'డబుల్'
- February 20, 2017
బహ్రెయిన్‌లో వలసదారులకు ఇకపై ఎలక్ట్రిసిటీ టారిఫ్ డబుల్ కానుంది. మార్చ్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఎలక్ట్రిసిటీతోపాటు, వాటర్ బిల్లులు కూడా 'డబుల్' మొత్తంలో వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నాయి. 0 నుంచి 3000 యూనిట్స్ వరకు ప్రస్తుతం 6 ఫిల్స్‌గా ఉన్న బిల్లు ఇకపై 13 ఫిల్స్‌కి (ఒక్కో యూనిట్) చేరుకుంటుంది. అదే వాటర్ విషయానికొస్తే 0 నుంచి 60 యూనిట్ల వరకు 80 ఫిల్స్ నుంచి 200 ఫిల్స్‌కి (ఒక్కో యూనిట్) చేరుకుంటుంది. గత ఏడాది మార్చ్ నుంచి వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ బిల్స్‌లో సంస్కరణలు తీసుకొచ్చారు. సబ్సిడీలు ఎత్తివేయడం, అలాగే ధరల్ని పెంచడం ద్వారా ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం.

తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







