నేడు తమిళనాడుకు ప్రధాని నరేంద్ర మోదీ
- February 20, 2017
- ప్రధాని రాకను పురస్కరించుకొని కోయంబత్తూర్‌లో ఐదంచెల భద్రత
వాషర్‌మెన్‌పేట(చెన్నై): ఈషా షౌండేషన్ ఆధ్వర్యంలో 112 అడుగుల ఎత్తున్న శివుడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ప్రధాని రాకను పురస్కరించుకొని కోయంబత్తూర్‌లో ఐదంచెల భద్రతాఏర్పాట్లు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. వచ్చే 24న దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు జరుగనున్నాయి. ప్రతి యేడాది ఈషా షౌండేషన్ ఘనంగా నిర్వహిస్తోంది. ఈ యేడాది మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూర్‌లోని ఈషా షౌండేషన్ ప్రాంగణంలో 112 అడుగుల ఎత్తున్న ఆదియోగీ శివుడి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఈ ఆవిష్కరించనున్నారు.
ఇందుకుగాను వచ్చే 24వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని విమానం ద్వారా కోయంబత్తూర్ విమానాశ్రయానికి చేరుకొని, అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా ఈషా షౌండేషన్‌కు వెళ్లనున్నారు. ఇందుకోసం విగ్రహం వెనుక వైపున హెలిప్యాడ్ కూడా ఏర్పాటుచేశారు. కార్యక్రమం అనంతరం రాత్రి 7 గంటలకు ప్రధాని ఢిల్లీకి తిరుగుముఖం పట్టనున్నారు. ప్రధాని రాక సందర్భంగా తిరుప్పూర్, ఈరోడ్, సేలం, తిరుచ్చి జిల్లాల నుంచి 4,500 మంది పోలీసులు భద్రతా పనులను చేపట్టనున్నారు.
కేంద్ర ప్రత్యేక భద్రతా దళాలు, ఉన్నతాధికారుల బృందాలు మంగళవారం కోయంబత్తూర్‌కు చేరుకోనున్నారు. ఇదిలా ఉండగా, సోమవారం ఉదయం కోయంబత్తూర్ జిల్లా కలెక్టర్ హరిహరన్ నేతృత్వంలో ప్రధాని రాక సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా పనులపై సమీక్షాసమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం







