'హోలీ మస్తీ 2017' ప్రీ ఈవెంట్ ప్రెస్‌మీట్
- February 20, 2017
హోలీ మస్తీ సెకెండ్ ఎడిషన్ 2.0 - దుబాయ్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది క్రియేటివ్ ఏంజెల్స్. ఆర్గానిక్ హోలీ మస్తీ, ఈసారి ప్రత్యేకతగా నిర్వాహకులు పేర్కొంటున్నారు. మికా సింగ్, కనికా కపూర్ ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణ కానున్నారు. అల్ సహ్రా డిజర్ట్ రిసార్ట్‌లో మార్చ్ 10న ఈ ఈవెంట్ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రంగుల పండుగ అత్యద్భుతంగా జరగనుంది. యూఏఈలో ప్రముఖ డిజెలు హనీ, స్కార్పియో, క్రోనిక్ ఎం, జిటు, కరణ్ భాటియా, ఎఎమ్‌బి హోలీ మ్యూజిక్‌తో ఆహూతుల్ని అలరించనున్నారు. మ్యూజిక్, ఫుడ్, డ్రింక్స్, ఆర్గానిక్ కలర్స్‌తో హోలీని కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించబోతున్నారు. పిల్లల కోసం, ఫ్యామిలీస్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ప్లాటినం లిస్ట్, యూఏఈ ఎక్స్ఛేంజ్ ఔట్‌లెట్స్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ వేడుకకి ఆహ్వానితులే. Caiyad Phahad - ది మీడియా డాక్టర్ పిఆర్ మరియు మార్కెటింగ్ విషయాల్ని చూసుకుంటున్నారు. 055 7262362 నెంబర్లో మరిన్ని వివరాలు లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







