ఏపీలో కేసీఆర్కు గ్రాండ్ వెల్క్ం..!!
- February 20, 2017
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. కేసీఆర్కు స్వాగతం పలుకుతూ ఆయన అభిమానులు తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక మొక్కులను చెల్లించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల వెళుతున్నారు. ప్రత్యేక విమానంలో రేపు సాయంత్రం ఆయన రేణిగుంట చేరుకుంటారు.
అక్కడ నుంచి సాయంత్రం 6.30 గంటలకు ఆయన తిరుమల వెళతారు.
ఎన్నికల కోడ్ కారణంగా పోలీసులు పోస్టర్లను తొలగించినా, తెలంగాణ ముఖ్యమంత్రిపై గౌరవంతో గోడలకు అతికించిన స్వాగత పోస్టర్లను అలాగే వదిలేశారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి తిరుమల వస్తుండటంతో... ఆయనను ప్రత్యేక అతిథిగా పరిగణించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ అధికారులను ఆదేశించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక రాష్ట్రం అవిర్భవిస్తే సాలగ్రామ హారం, కంఠాహారం కానుకలుగా సమర్పించుకుంటానని కేసీఆర్ మొక్కుకున్నారు. ఆ కోర్కె నెరవేరడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి సాలగ్రామహారం, కంఠహారం సమర్పించుకోవడానికి మంగళవారం కుటుంబ సమేతంగా ఆయన తిరుమలకు వస్తున్నారు.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









