అమెరికా కొరడా అక్రమ వలసదారులపై
- February 21, 2017
వాషింగ్టన్: అక్రమ వలసదారులను సాధ్యమైనంత త్వరగా దేశం నుంచి పంపించేయాలని అమెరికా అంతర్గత భద్రత విభాగం(డీహెచ్ఎస్) కొత్త ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు, మరికొందరిని మినహాయించి అక్రమ వలసదారులందర్నీ పంపించాలని డీహెచ్ఎస్ సెక్రటరీ జాన్ కెల్లీ.. సరిహద్దు గస్తీ, వలస అధికారులకు మంగళవారం రెండు కఠిన ఉత్తర్వులు జారీ చేశారు. నేరాల్లో దోషులుగా తేలిన, నేరారోపణలు ఎదుర్కొంటున్న, ఎదుర్కొనే అవకాశమున్న అక్రమ వలసదారులను ముందుగా తరలించాలన్న ప్రాధాన్యాన్ని అలాగే కొనసాగించనున్నారు.
వలస చట్టాలను ఉల్లంఘించిన వారందరిపైనా చర్యలు తీసుకోనున్నట్లు డీహెచ్ఎస్ ఓ ప్రకటనలో పేర్కొంది. మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి సంబంధించి వెంటనే చర్యలు ప్రారంభించాలని కెల్లీ ఆదేశించారు.
కస్టమ్స్, బార్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీల్లోకి మరో 5వేల మంది, ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్లలోకి 10వేల మంది అధికారులను తీసుకోవాలన్నారు. ఈ ఆదేశాలతో అవసరమైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులు కష్టాలు ఎదుర్కోనున్నారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







