బ్రిటన్‌లో చదువుకునేందుకు భారతీయ విద్యార్థులకు ఎప్పుడూ తలపులు తెరిచే ఉంటాయి
- February 22, 2017
బ్రిటన్‌లో చదువుకునేందుకు భారతీయ విద్యార్థులకు ఎప్పుడూ తలపులు తెరిచే ఉంటాయని ఆ దేశ హై కమిషనర్ డొమ్నిక్ అస్కిత్ అన్నారు. యూకేలోని విశ్వవిద్యాలాయాలు అంతర్జాతీయ స్థాయి విద్యనందిస్తున్నాయని ఆయన అన్నారు. మహిళా ఆర్థిక సాధికారికతపై యూఎన్ నివేదికను ఆవిష్కరిస్తున్న సభలో పలు అంశాలపై అస్కిత్ మాట్లాడారు. భారతీయ విద్యార్థుల కోసం ఎలాంటి పరిమితులు లేకుండానే బ్రిటన్‌లో చదువుకునేందుకు వీసాలు మంజూరు చేస్తామని ఆయన అన్నారు.
దాదాపు 600 మంది భారతీయ విద్యార్థులకు బ్రిటన్ స్కాలర్‌షిప్ అందజేస్తోందని ఆయన వివరించారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు వివిధ దేశాలనుంచి వచ్చి బ్రిటన్‌లో చదువుకుంటున్నట్లు తెలిపారు.
కోర్సు అయిపోగానే విద్యార్థులు స్వదేశాలకు తిరిగివెళ్లేలా వీసా విధానాన్ని బ్రిటన్ కొనసాగిస్తోందని ఆయన వివరించారు. మహిళా సాధాకారికత కోసం ఉద్ధేశించిన 75 స్టార్టప్‌లపై బ్రిటన్ పెట్టుబడులు పెట్టినట్లు ఆయన తెలిపారు. భారత్‌లో ఉన్న బ్రిటన్ కంపెనీలు వారి ఆదాయంలో 7శాతం ఉద్యోగుల స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఖర్చు పెడుతున్నట్లు అస్కిత్ వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు









