ఏపీ సీఎం చంద్ర బాబు మైక్రోసాప్ట్ సీఈఓతో

- February 22, 2017 , by Maagulf
ఏపీ సీఎం చంద్ర బాబు మైక్రోసాప్ట్ సీఈఓతో

ముంబయిలో జరిగే మైక్రోసాప్ట్ ప్యూచర్ డీకోడెడ్ పై నిర్వహిస్తున్న సాంకేతిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేయనున్నారు.  ఈ సందర్భంగా మైక్రోసాప్ట్ సీఈఓ సత్య నాదెండ్లతో జరిపే సమావేశంలో పలు కీలక ఒప్పందాలు చేయనున్నారు.  విశాఖపట్నాన్ని ఫిన్‌టెక్ వ్యాలీగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అంతర్జాతీయ ఫిన్‌టెక్ సంస్థలైన వీసా, థామస్ రాయిటర్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకోనుంది.  లింక్డ్‌ఇన్ సంస్థతోనూ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు.   సత్యనాదెళ్లతో జరిపే భేటీలో ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ సాంకేతికత వాడకంలో మైక్రోసాప్ట్ సహకారాన్ని కోరనున్నారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిన్ టెక్ రంగంలో కీలకమైన రెండు అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com