కిడ్నాపైన ఇండియన్ డాక్టర్ ను విడుదల చేసిన ఉగ్రవాదులు
- February 22, 2017
ఎట్టకేలకు లిబియా ఉగ్రవాదుల చెర నుంచి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన డాక్టర్ రామ్మూర్తి విడుదలయ్యారు. ఈ మేరకు ఆయన కుటుంబీకులకు సమాచారం అందింది.ఆయన లిబియాలోని ఇండియన్ ఎంబసీకి చేరుకున్నారని, 25న ఢిల్లీకి చేరుకుంటారని తెలిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కొసనం రామ్మూర్తి వైద్యుడు. కుటుంబంతో ఏలూరు శివారు దొండపాడులో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో 16 ఏళ్ల కిందట రామ్మూర్తి లిబియా వెళ్లారు. ఆయనను 2015 సెప్టెంబర్‌లో లిబి యాలోని సిర్త్ పట్టణంలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపైన వారిలో ఒడిశాకు చెందిన ఒక వ్యక్తితో పాటు రామ్మూర్తి కూడా ఉన్నారని తెలియడంతో ఆయన భార్య, పిల్లలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరికి వారి నిరీక్షణకు తెరపడింది. ఆయన బుధవారం లిబియాలోని ఇండియన్ ఎంబసీకి క్షేమంగా చేరుకో వడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







