అంబులెన్సులకు దారి ఇవ్వని 97 మంది వాహనదారులకు జరిమానా
- February 23, 2017
ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులను క్షణాలలో మెరుగైన చికిత్స కోసం వేరే ప్రాంతానికి తరలించే అపర సంజీవిని వంటి వాహనానికి దారి ఇవ్వని నాగరికులు మన సమాజాంలో ఉన్నారు. ఈ విధంగా సహకరించని కొందరు వాహనదారులకు అబూధాబీ పోలీసులు జరిమానాలతో గట్టి చెక్ పెట్టారు. ఆయా వాహనాలు నడిపే డ్రైవర్లు తమ చుట్టుపక్కల ఏమి జరుగుతుందో కనీసం తెలుసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. పోలీస్ అత్యవసర వాహనాలకు దారి ఇవ్వని కారణంగా గత ఏడాది రాజధానిలో డజన్ల కొద్దీ డ్రైవర్లుకు పోలీసులు పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలరు. తర్వాత అంబులెన్సులు మరియు అత్యవసర వాహనాలు ఇచ్చుట విఫలమైందని వాహనదారులు వ్యతిరేకంగా తాజా హెచ్చరిక జారీ చేశారు.2016 లో అబూధాబీ పోలీసులు అత్యవసర వాహనాలకు ముందుకు వెళ్లేందుకు సహకరించని 97 మంది డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయనట్లు తెలిపారు. అబూధాబీ పోలీస్ ఎమర్జెన్సీకి ప్రజా భద్రతా విభాగానికి డైరెక్టర్ కల్నల్ మహమ్మద్ ఇబ్రహీం అల్ అమిరి మాట్లాడుతూ. ప్రాణాలను రక్షించే అంబులెన్సులను అడ్డుకోవడం ఇతర అత్యవసర వాహనాలకు చోటు ఇవ్వకుండా ఆపదలో ఉన్న జీవితాలను రక్షించే అవకాశం లేకుండా చేసే చర్యలు అనాగరికమైనవని వాటిని ఏమాత్రం ఉపేక్షించరానివని అన్నారు. రోడ్డు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులను తరలింపులో ప్రతి నిమిషం ఎంతో అమూల్యమైనదని, కేవలం ముందున్న వాహనదారుడు దారి వదలని మూర్ఖపు ప్రవర్తన కారణంగా ఎందరో అభాగ్యులు చనిపోతున్ననారని అన్నారు. అంబులెన్స్ ఆలస్యంకు కారణమయ్యే ప్రతిబంధకాలను అబుధాబి పోలీసులు తొలగిస్తారని ఆయన అన్నారు. అయితే మరికొంత మంది డ్రైవర్లు అంబులెన్స్ ముందుకు కొనసాగడానికి తమ వాహనాలను రోడ్డు పక్కకు తీసి సహకరిస్తున్న సహృదయులు లేకపోలేదన్నారు. రోగులు లేదా ప్రమాద బాధితుల త్వరగా చేరుకోవడానికి వారు తోడ్పడుతున్నారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







