అతి తక్కువ ధరకే ఇండిగో టికెట్
- February 23, 2017
రాయితీ టిక్కెట్ల వార్ లోకి దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా ఎంట్రీ ఇచ్చింది. దేశీయ మార్గాల్లో తగ్గింపు ధరలను బుధవారం ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో అన్నీ కలుపుకుని రూ.777రూపాయలకే టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ లో బుకింక్స్ ఫిబ్రవరి 25 వరకు అందుబాటులోఉండనున్నట్టుతెలపింది. అలాగే ఈ టికెట్ల ద్వారా ఏప్రిల్ 27 వరకూ ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. సెలెక్టెడ్ సెక్టార్లో, సెలెక్టెడ్ విమానాలకుమాత్రం ఈ ఆఫర్ పరిమితమని పేర్కొంది.
ఈ తగ్గింపు టికెట్ల ధరలు అగర్తలా-గౌహతి, శ్రీనగర-చండీఘఢ్ మధ్య రూ.777 అందుబాటులో ఉండగా, చెన్నై-హైదరాబాద్ మధ్య రూ. 999గా ఉండనున్నాయి. ప్రయాణానికి 19రోజుల ముందుబుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.అలాగే పరిమితమైన సీట్లు అందుబాటులో ఉన్నాయనీ, ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే చట్టబద్ధమైన పన్నులు మాత్రమే తిరిగి చెల్లించనున్నామని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు ఇండిగోఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించగలరు.
తాజా వార్తలు
- ‘అమరజీవి జలధార’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- తెలంగాణ: 13 రోజులు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు..
- కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!







