పూరితో బాలకృష్ణ 101వ సినిమా!
- February 23, 2017
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించనున్న 101వ సినిమా ఏదనే దానిపై క్లారిటీ వచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తన తర్వాతి సినిమా చేయడానికి బాలయ్య గ్రీన సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. క్రిష్ దర్శకత్వంలో ఆయన చేసిన వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' అమిత ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. శాతకర్ణి పాత్రలో బాలయ్య నటనా కౌశలానికి అందరూ ఫిదా అయ్యారు. కెరీర్‌పరంగా ఆ సినిమాతో ఓ మైలురాయిని అందుకున్న ఆయన.. తర్వాత ఏ సినిమా చేస్తారనే దానిపై రకరకాల వార్తలు వినిపించాయి. తమిళ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఆయన 101వ సినిమా చేయబోతున్నారంటూ మీడియాలోనూ జోరుగా ప్రచారం నడిచింది. అయితే 'శాతకర్ణి' తర్వాత చేసే సినిమాకు పూరి జగన్నాథ్‌ను దర్శకుడిగా బాలయ్య ఖాయం చేశారని విశ్వసనీయ సమాచారం.
జగన చెప్పిన మాస్ అండ్ పవర్‌ఫుల్ యాక్షన ఎంటర్‌టైనింగ్ స్టోరీ ఆయనకు బాగా నచ్చిందనీ, ఇప్పుడు ఆ సబ్జెక్ట్‌తోనే ముందుకెళ్లాలని ఆయన నిశ్చయించుకున్నారనీ తెలిసింది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారనీ, వారిలో నేటి తరం క్రేజీ హీరోయినలతో పాటు నిన్నటి తరం తారలూ ఉంటారనీ తెలిసింది. భవ్య క్రియేషన్స పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మహాశివరాత్రి సందర్భంగా నేడు వెలువడే అవకాశం ఉంది.
మరో మూడు వారాల్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీని తర్వాత కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఆయన నటించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- Dubai Honors Outstanding Educators with Golden Visas
- దుబాయ్‌లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు గోల్డెన్ వీసాలు
- ముగ్గురు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ వైద్య శాస్త్ర పురస్కారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!







