'బాహుబ‌లి2' టీం ప్ర‌మోష‌న్స్‌..

- February 24, 2017 , by Maagulf
'బాహుబ‌లి2' టీం ప్ర‌మోష‌న్స్‌..

భారత దేశం గర్వించ దగ్గ సినిమాగా నిలిచింది బాహుబలి. ఈ సినిమా ఇంత భారీ విజయం సాధించడానికి కారణం కేవలం నటీనటులే కాక సాంకేతిక నిపుణుల పనితనం కూడా ఎంతో ఉంది. బాహుబలి ది బిగినింగ్ కి సీక్వెల్ గా బాహుబలి ది కంక్లూజన్ చిత్రం తెరకెక్కగా ఈ చిత్రానికి వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేస్తుంది బాహుబలి టీం. రీసెంట్ గా కాకినాడ లోని నాగమల్లితోట జంక్షన్‌ సమీపంలోని లాల్‌బహుద్దూర్‌ నగర్‌ మిర్చి రెస్టారెంట్‌లో విజువల్‌ రియాల్టీ ఎఫెక్ట్స్‌ను ప్రదర్శించారు. బాహుబలి-2 చిత్రాన్ని విజువల్‌ రియాల్టీలో చూడడం ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుందని బాహుబలి-2 చిత్రం సాంకేతిక నిపుణుడు కరుణాకరన్‌ చెప్పారు. బాహుబలి 2 చిత్రాన్ని దేశవ్యాప్తంగా 400 సెంటర్లలో విడుదల చేయనున్నట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com