పాకిస్తాన్లో విమాన విషాదం
- February 24, 2017
పాకిస్తాన్‌కి చెందిన ఓ ప్రయివేట్ ట్రైనర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మార్గమధ్యంలోనే కుప్పకూలింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో విమానం నేర్పిస్తున్న ఇన్స్ట్రక్టర్ సహా ట్రైనీ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. షాహీన్ ఎయిర్ ఫ్లైయింగ్ ట్రైనింగ్ స్కూల్ (ఎస్ఏఎఫ్టీఎస్)కి చెందిన ఈ రెండు సీట్ల తేలికపాటి విమానం... ప్రమాదం కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:40 గంటలకు బయల్దేరిన ఈ విమానం 15 నిమిషాలకే సాంకేతిక లోపం కారణంగా పంజాబ్‌లోని ఫైసలాబాద్‌కు చేరుకోగానే కూలిపోయింది. దీనిపై విచారణకు ఆదేశించినట్టు పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ ప్రకటించింది.
గతేడాది డిసెంబర్లో పాకిస్తాన్‌కి చెందిన ఓ విమానం కుప్పకూలడంతో 47 మంది చనిపోయారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







