ఆపిల్‌ రబ్డి

- February 24, 2017 , by Maagulf
ఆపిల్‌ రబ్డి

కావలసిన పదార్థాలు: చిక్కటి పాలు - 3 కప్పులు, చక్కెర - రెండున్నర టే.స్పూన్లు, యాపిల్‌ తరుగు - 3/4 కప్పులు, బాదం పలుకులు - 3 టే.స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూను.
తయారీ విధానం: నాన్‌స్టిక్‌ పాన్‌ వేడి చేసి పాలు పోసి చిన్న మంట మీద 25 నిమిషాలు కాచాలి. పాలు సగానికి చిక్కబడేలా తరచుగా కలుపుతూ మరిగించాలి. చక్కెర, యాపిల్‌ తరుగు వేసి చిన్న మంట మీద ఉంచి కలుపుతూ 4 నిమిషాలు ఉడికించాలి. బాదం పలుకులు, యాలకుల పొడి వేసి కలపాలి. రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్‌ చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com