అజ్మీర్ దర్గాకు బాంబు బెదిరింపు వచ్చింది
- September 21, 2015
భారత్ దేశంలోనే కాక విదేశాల్లోనూ ఎంతో ప్రాచుర్యం పొందిన అజ్మీర్ దర్గాకు బాంబు బెదిరింపు వచ్చింది. 12వ శతాబ్దం నాటి ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాలో బాంబు పెట్టినట్లు సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేయడంతో వెంటనే దర్గాను ఖాళీ చేయించారు. ఆ సమయానికి దర్గాలో దాదాపు లక్ష మంది వరకు భక్తులు ఉన్నారు. దర్గాలోకి బాంబు డిటెక్టర్లతో పోలీసు కమాండోలు ప్రవేశించడంతో వాళ్లంతా ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. మొత్తం అన్ని గేట్ల నుంచి భక్తులను బయటకు పంపి, మొత్తం ప్రాంగణం అంతటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దాదాపు అరగంట పాటు తనిఖీ చేసిన తర్వాత అక్కడ ఎలాంటి బాంబు లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రాంతంలో హై ఎలర్ట్ ప్రకటించి, క్విక్ రెస్పాన్స్ బృందాలు ఆ మార్గాన్ని తమ అదుపులోకి తీసుకున్నాయి. తెల్లవారుజామున 6.40 గంటల సమయంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది. దర్గాను పేల్చేస్తామని బెదిరింపు రావడంతో ఉదయం 7.45 నుంచి 9.15 వరకు దర్గాను మూసేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







