'వరాలసాయి' మందిరంలో వైభవంగా శివకళ్యాణం
- February 25, 2017మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భారతదేశమంతటా ప్రత్యేక పూజలు మరియు ప్రవచనాలతో భక్తులు మహాశివుణ్ణి కొలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లాకు చెందిన గూడూరు మండలంలో దత్తక్షేత్రం 'వరాలసాయి' మందిరంలో షిర్డీసాయి ఉపాసకులు పూజ్య దంపతులైన శ్రీ రామ్ రతంజీ మరియు మాత గార్ల ఆధ్వర్యంలో కల్యాణమంటపము నూతనంగా మందిర ఆవరణలో వైభవంగా ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భంగా గురూజీ దంపతులు మరియు పలువురు ప్రముఖులు లింగోద్భవ కాలంలో శివ కళ్యాణం జరిపించి కళ్యాణమంటప శోభను ఇముడింపజేశారు. పూజ్య గురువులు శ్రీ రామ్ రతంజీ మాట్లాడుతూ " మహాశివరాత్రి నాడు శివ కల్యాణంతో ఈ కల్యాణ మండపాన్ని ప్రారంభించటం ఎంతో ఆనందంగా ఉందని మరియు వరాల సాయి కృపాకటాక్షాలు అందరిపై ఉండునని" ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గురు దంపతులతోపాటు రవికుమార్ చోడవరపు దంపతులు, కృష్ణ రంజన్ దంపతులు, గుడ్లవల్లేటి పవన్ కుమార్ దంపతులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









