మార్చి 31న జీఎస్‌ఎల్‌వీ ఎప్-09, ఏప్రిల్‌లో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగం
- February 25, 2017
శ్రీహరికోట(సూళ్లూరుపేట):
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి మార్చి 31న జీఎస్‌ఎల్‌వీ ఎప్-09, ఏప్రిల్‌లో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3, అదే నెలలోనే పీఎస్‌ఎల్‌వీ సీ38 ప్రయోగాలను నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్దమవుతున్నారు. ఈనెల 15న ఫ్రయోగించిన 104 ఉపగ్రహాల ప్రయోగంతో మంచి జోష్ మీదున్న ఇస్రో శాస్త్రవేత్తలు ఏకకాలంలో మూడు రాకెట్‌ల అనుసంధానం పనులు చేస్తున్నారు.
రెండవ ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ భవనం (వీఏబీ)లో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్09 అనుసంధానం పనులు జరుగుతున్నాయి. అదే విధంగా సాలిడ్ స్టేజీ అసెంబ్లింగ్ బిల్డింగ్ (ఎస్‌ఎస్‌ఏబీ)లో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ అనుసంధానం పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.
దీనికి సంబంధించి ఎస్-200, ఎల్-110, సీ-25 అనే మూడుదశలకు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయవంతమయ్యాక ఆ దశలను అనుసంధానం చేస్తున్నారు.
జీఎస్‌ఎల్‌వీ ఎప్-09 రాకెట్ ద్వారా 2 టన్నుల బరువైన జీశాట్-9, జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ ద్వారా నాలుగు టన్నుల బరువు కలిగిన జీశాట్-19 అనే సమాచార ఉపగ్రహాలను రోదసీలోకి పంపించేందుకు సన్నాహాలు ముమ్మరంగా చేస్తున్నారు. మొదటి ఫ్రయోగ వేదికపై మరో వారం రోజుల్లో పీఎస్‌ఎల్‌వీ సీ38 పనులు ప్రారంభించేందుకు కూడా సిద్దమవుతున్నారు. ఇందులో దూరపరిశీలనా ఉపగ్రహంతో పాటు వాణిజ్యపరమైన ఉపగ్రహాలుండే అవకాశం వుంది.
ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించి చరిత్ర సృష్టించి ఇప్పుడు మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఈ మూడు ఫ్రయోగాలను చేసి మరో రికార్డును సృష్టించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు కృషి చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







