హాస్య నటుడు తవకలై గుండె పోటుతో హఠాన్మరణం

- February 26, 2017 , by Maagulf
హాస్య నటుడు తవకలై గుండె పోటుతో హఠాన్మరణం

మరగుజ్జు నటుల్లో హాస్యనటుడిగా పాపులర్ అయిన తవకలై గుండెపోటుతో హఠాత్తుగా మృతిచెందారు. తవకలై వయసు 42 ఏళ్ళు... 1983 లో భాగ్యరాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన "ముందానై ముదిచ్చు" సినిమాతో  కోలీవుడ్ లో నటుడుగా అడుగు పెట్టారు.. సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి అగ్రహీరోల సినిమాల్లో నటిస్తూ మంచి హాస్యనటుడిగా గుర్తింపు పొందిన తవకలై "ఆనపావం" వంటి సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించారు.. తమిలంతో పాటు తెలుగు, మలయాళ, హిందీ, సింహళి తదితర భాషల్లో దాదాపు 490 కి పైగా సనిమాల్లో నటించిన తవకలై కు గత కొంత కాలంగా సినిమాల్లో అవకాశాలు లేవు.. దీంతో బుల్లి తెరపై అడుగుపెట్టి నటన కొనసాగిస్తున్నారు... స్థానిక వడపళని లోని మురుగన్ కోయిల్ సమీపంలో నివాసం ఉంటున్న తవకలై ఆదివారం హఠాత్తుగా గుండెపోటుకు గురై అకాల మరణం చెందారు... ఈ విషయం తెలిసిన సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నడిగర్ సంఘం సంతాపం తెలిపింది.. ఈరోజు అంత్యక్రియలు జరగనున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com