ఖతార్ షాపింగ్ మాల్స్‌లో పార్కింగ్ ఫీజుల పెంపు!
- February 27, 2017
ఖతార్‌లోని ప్రముఖ షాపింగ్ మాల్స్, పార్కింగ్ ఫీజుల్ని పెంచే యోచనలో ఉన్నాయి. పార్కింగ్ లాట్స్‌ని కొందరు మోటరిస్టులు దుర్వినియోగం చేస్తుండడంతో ఈ ఆలోచన చేస్తున్నారు షాపింగ్ మాల్స్ నిర్వాహకులు. షాపింగ్ మాల్స్‌లో తమ వాహనాల్ని పార్క్ చేసేసి, వేరే పనుల నిమిత్తం వెళుతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు తమ దృష్టికి రావడంతోనే ఈ ఆలోచన చేస్తున్నామని వారు చెప్పారు. ఖతార్ ఛాంబర్లో జరిగిన ట్రేడ్ అండ్ రీసెర్చ్ కమిటీలో ఈ అంశం చర్చకు వచ్చింది. పలు ఇతర అంశాల్ని కూడా ఈ సమావేశంలో షాపింగ్ మాల్స్ యాజమాన్యాలు చర్చించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ - విజిటర్స్ కోసం నిర్ణయించిన పార్కింగ్ ఫీజులు తక్కువ ఉండటంతోనే ఈ దుర్వినియోగం జరుగుతోందని పలువురు ప్రస్తావించారు. షాపింగ్ మాల్ వినియోగదారులకు నిర్దేశిత ఫీజు వసూలు చేయడం, ఇతరులకు అదనంగా ఫీజులు వసూలు చేయడం మంచిదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రేడ్ అండ్ రీసెర్చ్ కమిటీ - ఖతార్ ఛాంబర్ హెడ్ అదిల్ అబ్దుర్రహమాన్ అల్ మన్నాయ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ఖతార్ టూరిజం అథారిటీ ప్రతినిథి కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









