జీవితఖైదు 'సిమి' చీఫ్‌కు
- February 27, 2017
దేశద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు
ఇండోర్: నిషేధిత 'సిమి' సంస్థ చీఫ్ సఫ్దార్ హుస్సేన్ నగోరి, మరో 10 మంది కార్యకర్తలకు 2008 నాటి దేశ ద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. నగోరితో పాటు హఫీజ్ హుస్సేన్ , ఆమిల్ పర్వజ్, శివ్లి, కమృద్దీన్, షహ్దౌలి, కమ్రాన్ , అన్సార్, అహ్మద్ బైగ్, యాసిన్ , మున్రోజ్‌లకు జీవితఖైదు ఖరారు చేస్తూ ప్రత్యేక అదనపు సెషన్స్ జడ్జి బి.కె.పలోడా తీర్పు వెలువరిం చారు. భారత రాజ్యాంగం, చట్టాలపై దోషులకు విధేయత లేదని వారి చర్యల ద్వారా స్పష్టమైందని 84 పేజీల తీర్పులో కోర్టు అభిప్రాయపడింది.
'దేశ సమైక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా వారు ప్రవర్తించారు.
మత విద్వేషాలను ప్రోత్స హించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు' అని పేర్కొంది. మన్రోజ్ మినహా మిగిలిన 10 మంది నిందితులను అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉంచినట్లు ప్రభుత్వ న్యాయవాది విమల్ మిశ్రా తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పు వివరాలను తెలియజేయాలన్న నిందితుల అభ్యర్థన మేరకు కోర్టు.. తీర్పు వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి తెలియజేసింది.
తాజా వార్తలు
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు







