ముగిసిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె
- February 28, 2017_1488302813.jpg)
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జరిగిన సమ్మెలో ఉద్యోగులంతా పాల్గొన్నారని కన్వీనర్ కె.ఆదినారాయణమూర్తి తెలిపారు. ప్రజా వ్యతిరేక బ్యాంకింగ్ సంస్కరణలను, ఉద్యోగి వ్యతిరేక కార్మిక సంస్కరణలను, బ్యాంకు ఉద్యోగాల ఔట్‌సోర్సింగ్‌ను వ్యతిరేకిస్తూ, ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, రాని బాకీల వసూలుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపడుతున్నామన్నారు. జిల్లాలోని సుమారు 700 బ్యాంకు శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా మంగళవారం జరిగిన బ్యాంకు ఉద్యోగుల జాతీయ సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. సమ్మె కారణంగా జిల్లాలోని బ్యాంకు శాఖలు మూతపడ్డాయి అని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఖైరతాబాద్ సిండికేట్ బ్యాంకు రీజినల్ ఆఫీస్ మరియు స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.


తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







