వినాయక్ చేతులమీదుగా 'వెంకటాపురం' తోలి పాట
- March 01, 2017
హ్యాపీడే్స్'లో టైసన్‌గా ఆకట్టుకున్న రాహుల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'వెంకటాపురం'. మహిమా మక్వాన్ నాయిక. గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్ నిర్మిస్తున్నారు. 'సామి రారా', 'రౌడీ ఫెలో' సినిమాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా తొలి పాటను డైరెక్టర్ వి.వి. వినాయక్ ఆవిష్కరించారు. ఇటీవల సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విడుదల చేసిన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. పది లక్షలకు పైగా వ్యూస్‌ను రాబట్టింది. ఇప్పుడు వినాయక్ లాంచ్ చేసిన పాట కూడా సంగీత ప్రియుల్ని అలరిస్తోందని నిర్మాతలు తెలిపారు. ''ఒక యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా నడుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నాం. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తాం'' అని వారు చెప్పారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







