సెక్స్ వర్కర్స్‌కి జైలు శిక్ష
- March 01, 2017
దుబాయ్: ఇద్దరు మహిళలు, బోగస్ ఉద్యోగాల పేరుతో మరికొందరు మహిళల్ని మోసం చేసి, వారిని వ్యభిచార వృత్తిలోకి దించిన కేసులో జైలు శిక్ష ఎదుర్కొనాల్సి వస్తోంది. 3 ఏళ్ళ నుంచి వీరికి 5ఏళ్ళ జైలు శిక్షకు పెంచింది న్యాయస్థానం. మొరాకోకి చెందిన 22 ఏళ్ళ వయసు మహిళ, 39 ఏళ్ళ వయసు మహిళ కలిసి 20 నుంచి 27 ఏళ్ళ వయసున్న మహిళల్ని ఆకర్షించి, వారితో వ్యభిచార కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నారు. ముందుగా బాధిత మహిళల పాస్‌పోర్టుల్ని స్వాధీనం చేసుకుని, వారిని బెదిరించి వ్యభిచార వృత్తిలోకి నెట్టేస్తున్నారు. అలా వ్యభిచార వృత్తి నుంచి భారీగా ఆర్జనకి అలవాటుపడ్డారు. న్యాయస్థానం వీరికి మూడేళ్ళ జైలు శిక్షను విధించగా, అపీల్ కోర్టులో శిక్ష తగ్గింపు కోసం వారు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే వ్యభిచారానికి పాల్పడటం, వ్యభిచార నేరంలోకి మహిళల్ని అక్రమంగా దించడం, మరికొన్ని ఆరోపణల నేపథ్యంలో వీరి జైలు శిక్షను 3 ఏళ్ళ నుంచి ఐదేళ్ళకు పెంచడం జరిగింది. జైలు శిక్ష పూర్తయ్యాక వీరిని దేశం నుంచి పంపేస్తారు.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









